Share News

తీవ్రమైన తాగునీటి సమస్య

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:37 AM

స్థానిక పలు కాలనీలకు తాగునీటిని సరఫరా చేసే రెండు బోర్లలో నీరు అడుగంటి పోయాయి. దీంతో వారం రోజులుగా ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.

తీవ్రమైన తాగునీటి సమస్య
అరకొరగా వస్తున్న నీరు

పుట్లూరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక పలు కాలనీలకు తాగునీటిని సరఫరా చేసే రెండు బోర్లలో నీరు అడుగంటి పోయాయి. దీంతో వారం రోజులుగా ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా వస్తున్న నీటి కోసం వేచివుంటున్నారు. ఇటీవల టీడీపీ నాయకుడు పుల్లారెడ్డి ఏర్పాటు చేసిన బోరులోనూ అరకొరగా నీరు వస్తోంది. అధికారులు మరో బోరు వేసి.. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆ గ్రామస్థులు

కోరుతున్నారు.

Updated Date - Dec 18 , 2025 | 12:37 AM