Share News

Self-survey ఏడాది పాలనపై స్వీయ సర్వే

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:06 AM

టీడీపీ ఏడాది పాలనపై స్వీయ సర్వేను వచ్చే నెల రెండో తేదీ నుంచి చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు.

Self-survey  ఏడాది పాలనపై స్వీయ సర్వే
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం


గుంతకల్లు, జూన 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఏడాది పాలనపై స్వీయ సర్వేను వచ్చే నెల రెండో తేదీ నుంచి చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. శనివారం స్థానిక పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో క్లస్టర్‌, యూనిట్‌, బూత కమిటీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బూత, యూనిట్‌, క్లస్టర్‌ కమిటీలు ఇంటింటికీ వెళ్లి.. ఈ ప్రభుత్వ పాలనపై సర్వేను నిర్వహించి.. యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌-సిక్స్‌ హామీల్లో నాలుగింటిని అమలు చేశామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మిగిలిన రెండింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. అనంతరం సంస్థాగత ఎన్నికల్లో నియమితులైన వారిని అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేసీ హరి, బండారు రామన్న చౌదరి, బీఎస్‌ కృష్ణారెడ్డి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, గుమ్మనూరు వెంకటేశులు, తలారి మస్తానప్ప, పాల మల్లికార్జున, అంజి పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 12:06 AM