జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:11 AM
విజయవాడ కేఎల్ యూనివర్శిటీలో ఎయిడ్స్‌పై మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో స్థానిక జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న గౌసియా ప్రథమస్థానంలో నిలిచి రూ.10వేలు బహుమతి అందుకున్నారు.
తాడిపత్రి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): విజయవాడ కేఎల్ యూనివర్శిటీలో ఎయిడ్స్‌పై మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో స్థానిక జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న గౌసియా ప్రథమస్థానంలో నిలిచి రూ.10వేలు బహుమతి అందుకున్నారు. సెప్టెంబరు 7న ముంబైలో నిర్వహించే జాతీయస్థాయి క్విజ్ పోటీలకు రాష్ట్రం తరపున పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ తెలిపారు.