Selected యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:38 AM
యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు ఉరవకొండకు చెందిన 13మంది ఎంపికైయ్యారు.

ఉరవకొండ,జూన 15(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు ఉరవకొండకు చెందిన 13మంది ఎంపికైయ్యారు. విజయవాడలో సోమవారం నుంచి రెండ్రోజుల పాటు జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు.
గుత్తి : రాష్ట్ర స్థాయి యోగాంధ్రా పోటీలకు గుత్తికి చెందిన ఇద్దరు ఎంపికైనట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్‌మీయా ఆదివారం తెలిపారు. మున్సిపాల్టీ నుంచి యోగా పెయింటింగ్ విభాగంలో సుశీల, షార్ట్‌ఫిలిం విభాగంలో విజయభాస్కర్ ఎంపికయ్యారన్నారు. ఇరువురు ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి యోగాంధ్రా పోటీల్లో పాల్గొంటారన్నారు.