Share News

రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్‌కు ఎంపిక

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:05 AM

: పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్‌ పాఠశాల విద్యార్థినులు నందిత, రుహానా అంజుమ్‌ రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్‌కు ఎంపికయ్యారని హెచఎం శ్రీనివాసులు సోమవారం తెలిపారు.

రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్‌కు ఎంపిక
ఎంపికైన నందిత, రుహానా అంజుమ్‌

గుంతకల్లుటౌన, డిసెంబరు22(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్‌ పాఠశాల విద్యార్థినులు నందిత, రుహానా అంజుమ్‌ రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్‌కు ఎంపికయ్యారని హెచఎం శ్రీనివాసులు సోమవారం తెలిపారు. రాప్తాడులోని జిల్లా పరిషత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స ఫెయిర్‌లో ప్రతిభ చాటడం ద్వారా రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. విజయవాడలో మంగళవారం నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్‌లో విద్యార్థినులు నమూనాను ప్రదర్శిస్తారన్నారు. విద్యార్థినులకు సుమబాల, సుమలత, రామచంద్ర గైడ్‌లుగా వ్యవహరిస్తారన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:05 AM