Share News

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:24 AM

స్థానిక మాంటిసోరి హైస్కూల్‌లో సోమవారం అనంతపురం జిల్లా యోగా అసోసియేషన ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

గుంతకల్లుటౌన, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక మాంటిసోరి హైస్కూల్‌లో సోమవారం అనంతపురం జిల్లా యోగా అసోసియేషన ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అసోసియేషన సెక్రెటరీ మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలకు నల్గొండ, కదిరి, అనంతపురం, తాడిపత్రి, కల్యాణదుర్గం, గుత్తి ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారన్నారు. 8సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల విభాగాలలో బాల, బాలికలు, మహిళలు, పురుషులు ఎంపికయ్యారు. ఈ క్రీడాకారులు వచ్చే నెల 6, 7 తేదీల్లో తాడేపల్లి గూడెంలో జరిగే రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారన్నారు. స్కూల్‌ డైరెక్టర్లు కర్ణాటక నాగార్జున, అనిల్‌కుమార్‌, వంశీ కృష్ణ క్రీడాకారులను అభినందించారు.

Updated Date - Aug 19 , 2025 | 12:24 AM