Share News

తాళం తీయని సచివాలయాలు

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:36 AM

మండలంలో శుక్రవారం పలు సచివాలయాలకు తా ళం కూడా తీయలేదు. తాడిపత్రిలో బీఎల్‌ఓల సమావేశం ఉండడంతో సిబ్బంది మొత్తం అక్కడకు వెళ్లారు.

తాళం తీయని సచివాలయాలు
యాడికిలో మూసివున్న సచివాలయం,

యాడికి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): మండలంలో శుక్రవారం పలు సచివాలయాలకు తా ళం కూడా తీయలేదు. తాడిపత్రిలో బీఎల్‌ఓల సమావేశం ఉండడంతో సిబ్బంది మొత్తం అక్కడకు వెళ్లారు. శుక్రవారం సదరం స్లాట్‌ బుకింగ్‌ ఓపెన కావడంతో అనేక మంది సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. మధ్యాహ్నం వరకూ సచివాలయాల తాళం కూడా తీయకపోవడంతో వారు నిరాశతో వెనుతిరిగారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓ శశికళను వివరణ కోరగా.. సచివాలయ సిబ్బంది బీఎల్‌ఓల శిక్షణకు వెళ్లారనీ, సచివాలయాలకు తాళాలు వేసి వెళ్లకూడదని, కనీసం ఒకరైనా అందుబాటులో ఉండాలని, ఎందుకు అలా జరిగిందో విచారిస్తామని తెలిపారు.

Updated Date - Nov 15 , 2025 | 12:36 AM