Share News

యూరియా కోసం పడిగాపులు

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:26 PM

యూరియా కొరత లేదని జిల్లా అధికారులు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

యూరియా కోసం పడిగాపులు
ఉద్ధేహళ్‌ కోరమండల్‌ వద్ద గుమికూడిన రైతులు

బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): యూరియా కొరత లేదని జిల్లా అధికారులు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మండలంలోని గురువారం బొమ్మనహాళ్‌, ఉద్దేహాళ్‌, శ్రీధరఘట్ట, గోవిందవాడ, దేవగిరి ఆర్‌ఎ్‌సకేలతో పాటు ఉద్దేహాళ్‌లో కోరమండల్‌లో యూరియా పంపిణీ చేశారు. యూరియా కోసం రైతులు ఆయా కేంద్రాల వద్ద వేకువజామున నుంచీ క్యూలైనలో టోకెన్ల వారీగా వేచి ఉన్నారు. జిల్లా అధికారులు, ప్రజాపత్రినిధులు యూరియా కొరత లేదంటూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. పది ఎకరాలున్న రైతులకూ ఒకటి, రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. కాగా, మండలంలోని ఆర్‌ఎ్‌సకే, కోరమండల్‌లో యూరియా పంపిణీని తహసీల్దార్‌ మునివేలు పరిశీలించారు. రెండురోజుల్లో రైతులందరికీ యూరియా అందుబాటలో ఉంటుందని తెలిపారు. అలాగే రైతులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు నానో యూరియాపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

Updated Date - Sep 11 , 2025 | 11:26 PM