శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:27 AM
మూఢ నమ్మకాలు సమాజ ప్రగతికి అవరోధంగా ఉన్నాయని, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని జేవీవీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పేర్కొన్నారు.
గుత్తి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మూఢ నమ్మకాలు సమాజ ప్రగతికి అవరోధంగా ఉన్నాయని, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని జేవీవీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పేర్కొన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణంలో ఆదివారం జేవీవీ 18వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా గేయానంద్‌తోపాటు రాష్ట్ర నాయకులు డాక్టర్ తరిమెల అమర్నాథ్‌రెడ్డి, రామాంజనేయులు, ఆదిశేషు, తదితరులు మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు సనాతన ధర్మం పేరుతో ప్రజల్లో మూఢ నమ్మకాలు అశాస్త్ర విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం పరిచారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించాలని సమావేశంలో తీర్మానించారు. అనంత రం కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటరామిరెడ్డి, సత్యనారాయణ, సాకే భాస్కర్, డాక్టర్ రంగన్న, గేట్స్ కళాశాల కరస్పాండెంట్ వీకే పద్మావతి, మురళీధర్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మహ్మద్ జిలాన, రంగనాథ్, సీతానంద, శ్రీధర్‌గౌడ్, దేశాయ్ నాగరాజు పాల్గొన్నారు.