Share News

Sriharikota ప్రతిభావంత విద్యార్థులకు విజ్ఞాన యాత్ర

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:24 PM

సాంకేతిక రంగాల్లో తమదైన ప్రతిభ కనబరచిన స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థినులకు సత్యసాయి జిల్లా విద్యాశాఖ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసింది.

Sriharikota ప్రతిభావంత విద్యార్థులకు విజ్ఞాన యాత్ర
శ్రీహరికోట వద్ద గాండ్లపెంట విద్యార్థినులు

గాండ్లపెంట, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : సాంకేతిక రంగాల్లో తమదైన ప్రతిభ కనబరచిన స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థినులకు సత్యసాయి జిల్లా విద్యాశాఖ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసింది. ఈ యాత్రలో భాగంగా ఆ విద్యార్థులు గురువారం శ్రీహరికోట (అంతరిక్ష పరిశోధన కేంద్రం)ను సందర్శించారు. విద్యార్థులు ఆరీషా, సాధబ్‌, లిఖిత, యశ్వనీ, శమఫిర్‌దోష్‌, మోక్షిత, నీహతబ్‌సుమ్‌, గీతిక, పూజిత ఆ పరిశోధన కేంద్రంలో పలు రాకెట్‌, శాటిలైట్ల నమూనాలను పరిశీలించారు. వీరి వెంట ఉపాధ్యాయులు ఓబులరెడ్డి, రాజారత్నం ఉన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:24 PM