Share News

Schools గ్రామాల్లో పాఠశాలలను కొనసాగించాలి

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:25 PM

ప్రభు త్వం గ్రామీణ ప్రాంతా ల్లో ప్రాథమిక పాఠశాలలను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కొనసాగించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కో నంకి అశోక్‌కుమార్‌ అన్నా రు.

Schools గ్రామాల్లో పాఠశాలలను కొనసాగించాలి
మాట్లాడుతున్న అశోక్‌కుమార్‌

కొత్తచెరువు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం గ్రామీణ ప్రాంతా ల్లో ప్రాథమిక పాఠశాలలను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కొనసాగించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కో నంకి అశోక్‌కుమార్‌ అన్నా రు. స్థానిక జడ్పీహెచఎ్‌స బాలుర పాఠశాలలో ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తొమ్మిది రకాలుగా ప్రభుత్వ పాఠశాలలను విభజిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను లేకుండా చేయడానికి చర్యలు చేపడుతోందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు విధ్యకు దూరం అవుతారన్నారు. కావున బడుల విభజనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. లేకపోతే ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మే ఐదో తేదీన తాలూకా కేంద్రాల్లో, తొమ్మిదిన జిల్లా కేంద్రంలో, 14న విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌. చంద్ర, జిల్లా గౌరవ అధ్యక్షుడు పీవీ మాధవ, కమిటీ సభ్యులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:25 PM