సత్యసాయిబాబా జయంతి వేడుకలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:23 AM
స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
గుత్తి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 130 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. బ్రాహ్మణ వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు ఎనవీ రమణ, సత్యనారాయణరెడ్డి, విశ్వనాథ్, రాజేంద్ర పాల్గొన్నారు.