Share News

protest for salaries జీతాల కోసం పారిశుధ్య కార్మికుల రిలేదీక్షలు

ABN , Publish Date - May 24 , 2025 | 11:18 PM

మండలంలోని వివి ధ సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు తకు జీతాలు చెల్లించాలని స్థానిక పోలీస్‌ స్టేషన వద వారం రోజుల నుంచి రిలేదీక్షలు చేపట్టారు

protest for salaries    జీతాల కోసం పారిశుధ్య కార్మికుల రిలేదీక్షలు
పచ్చగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేస్తున్న పారిశుధ్య కార్మికులు

గాండ్లపెంట, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివి ధ సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు తకు జీతాలు చెల్లించాలని స్థానిక పోలీస్‌ స్టేషన వద వారం రోజుల నుంచి రిలేదీక్షలు చేపట్టారు. శనివారం వారు పచ్చగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు రైతు సంఘం నాయకులు కెకె. రాజారెడ్డి, ఖాదర్‌బాషా మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ పారిశుధ్య కార్మికులకు రెం డు సంవత్సరాలుగా జీతాలు అందడం లేదన్నారు. దీంతో వారి కుటుంబ పోషణఽ దుర్భరంగా ఉందన్నారు. వెంటనే అందరికి జీతాలు చెల్లించాలని కోరారు. ఈ దీక్షలో పారిశుధ్య కార్మికులు నరసింహ, కదిరప్ప, దొడ్డెప్ప, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:18 PM