కళాశాల వేళకు బస్సులు నడపండి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:18 PM
స్థానిక జూనియర్ కళాశాల వేళకు బస్సులు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామీణ విద్యార్థులు వాపోయా రు.
బొమ్మనహాళ్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) :స్థానిక జూనియర్ కళాశాల వేళకు బస్సులు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామీణ విద్యార్థులు వాపోయా రు. వేళకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆ విద్యార్థులు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ మునివేలుకు సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ బస్సులు సమయానికి రాక అనే క మంది చదువు మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు సకాలంలో రాకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఓబులేసు, విద్యార్థులు పాల్గొన్నారు.