ఆర్టీసీ ఆదాయానికి గండి
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:22 AM
ఉరవకొండ నుంచి అనంతపురానికి అనుమతులులేని ప్రైవేట్ వాహనాలను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు
ఉరవకొండ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఉరవకొండ నుంచి అనంతపురానికి అనుమతులులేని ప్రైవేట్ వాహనాలను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. స్థానిక డిపో ఎదు టే వాహనాలు ఆపి .. ఆర్టీసీ ప్రయాణికులను వారివారి వాహనాల్లో ఎక్కించుకుని వెళ్తున్నా .. ఆర్టీసీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి నెలకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. ఇటీవల ప్రైవేట్ ఆపరేటర్లు 25 దాకా వాహనాలను కొనుగోలు చేసి, వాటిని ఉరవకొం డ, అనంతపురానికి తిప్పుతున్నారు. అనంతపురానికి ఆర్టీసీ బస్సులో టిక్కెట్లు ధర రూ.85 ఉంటే, వైట్ బోర్డు కలిగిన కార్లల్లో ఒక్కొక్కరికి చిన్న, పెద్ద అనే తేడాలేకుండా రూ.100 వసూలు చేస్తున్నారు. పెట్రోల్ వాహనాలను ఆపరేటర్లు ఆదాయం కోసం గ్యాస్, సిలిండర్ అమర్చుకుని తిప్పుతున్నా రు. నానస్టా్‌ప కావడంతో ధర ఎక్కువైనా ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వాహనాలను షిర్డీ సాయి ఫోర్ వీల్ మోటార్ వెహికల్ అసోసియేషన నాయకులు నాలుగు నెలల క్రితం అడ్డుకున్నారు. కొన్ని రోజులు కట్టడి చేసిన ఆర్టీసీ అధికారులు.. మళ్లీ ఆ ప్రైవేట్ వాహనాలు యదేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ అధికారులతో ఆ వాహన య జమానులతో కుమ్మక్కు అయ్యారనే విమర్శలు ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యం లో ఉరవకొండ ఆర్టీసీ డిపో తనిఖీకి వచ్చిన ఆర్టీసీ ఎండీకి ద్వారకా తిరుమల రావుకు ఆర్టీసీకి కలుగుతున్న నష్టంపై షిర్డీ సాయి ఫోర్ వీల్ మోటార్ వెహికల్ అసోసియేషన నాయకులు ఫిర్యాదు చేశారు. ఆర్‌ఎం, డీఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేద ని తెలిపారు. డీఎం హంపన్నను వివరణ కోరగా.. విషయాన్ని ఆర్టీఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కట్టడిచేస్తామన్నారు.