Share News

RTC సమస్యలపై ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:25 PM

తమ సమస్యలు పరిష్కరించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోషియేషన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా ఆయా డిపోల వద్ద గురువారం ఆందోళన చేపట్టారు.

RTC సమస్యలపై ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

పుట్టపర్తిటౌన, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోషియేషన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా ఆయా డిపోల వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా పుట్టపర్తి ఆర్టీసీ డిపో ఎదుట డిపో అధ్యక్షుడు శివశంకర్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు డిపో గేట్‌ వద్దు ధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం గత నెలలో ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 38 డిమాండ్లలో వినతిపత్రం ఇచ్చినా, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కార్యక్రమంలో ఎనఎంయూఏ నాయకులు శంకర్‌, శ్రీరామ్‌నాయక్‌, తిరుపతమ్మ, రవితేజ, అప్పిరెడ్డి, ఈశ్వరయ్య, గంగులయ్య, నూర్‌ మహమ్మద్‌, శివారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:25 PM