ఆర్టీసీ బస్టాండ్ తనిఖీ
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:21 AM
స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను ఏపీఎస్ ఆర్టీసీ కడప రీజనల్ చైర్మన పూల నాగరాజు బుధవారం తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వెలసిన వ్యాపార దుకాణాలపై ఆరా తీశారు.
పామిడి, ఆగష్టు 6(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను ఏపీఎస్ ఆర్టీసీ కడప రీజనల్ చైర్మన పూల నాగరాజు బుధవారం తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వెలసిన వ్యాపార దుకాణాలపై ఆరా తీశారు. పక్కాగా లీజ్ అగ్రిమెంట్, కొలతలు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. శిథిలమైన మరుగుదొడ్లను తొలగించి.. కొత్తగా నిర్మించాలని సూచించారు. ఆయన వెంట అనంతపురం, గుంతకల్లు డీఎంలు భూపాల్, గంగాధర్, కంట్రోలర్ గోపాల్ ఉన్నారు.