Share News

compensation పరిహారం ఇచ్చాకే రోడ్డు పనులు చేపట్టాలి

ABN , Publish Date - May 27 , 2025 | 11:26 PM

ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి జాతీయ రహదారి (342) నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని బాధిత రైతులు తేల్చిచెప్పారు.

 compensation పరిహారం ఇచ్చాకే రోడ్డు పనులు చేపట్టాలి
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

ముదిగుబ్బ, మే 27 (ఆంధ్రజ్యోతి): ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి జాతీయ రహదారి (342) నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని బాధిత రైతులు తేల్చిచెప్పారు. ఈ మేరకు మండలంలోని దొరిగల్లు రోడ్డు సమీపంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను రెండో రోజైన మంగళవారమూ అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణలో రూ. కోట్ల విలువ చేసే భూములు కోల్పోతున్నామని, రిజిస్ట్రేషన వేల్యూ ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని, లేకపోతే భూములు ఇచ్చే ప్రశక్తే లేదని అన్నారు. కనీసం గ్రామ సభలు నిర్వహించకుండా, రైతులకు పరిహారం ఎంత ఇస్తారో తెలపకుండా పనులు చేపట్టడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాధితులు సోమల ప్రకాష్‌, సనత కుమార్‌ విశ్వనాథ్‌, ప్రభాకర్‌, హనుమంతు, ప్రసాద్‌, జయచంద్ర పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:26 PM