Share News

రోడ్డు, ఆర్వో ప్లాంట్‌ ప్రారంభం

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:40 AM

కుందుర్పి నుంచి జంబగుంపల, కొలిమిపాళ్యం వరకు నాబార్డు ద్వారా రూ. రెండు కోట్లతో నిర్మించిన ఆరు కిలోమీటర్లు తారు రోడ్డును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ శుక్రవారం ప్రారంభించారు

 రోడ్డు, ఆర్వో ప్లాంట్‌ ప్రారంభం
ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని

కుందుర్పి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): కుందుర్పి నుంచి జంబగుంపల, కొలిమిపాళ్యం వరకు నాబార్డు ద్వారా రూ. రెండు కోట్లతో నిర్మించిన ఆరు కిలోమీటర్లు తారు రోడ్డును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేరకు ఒక్క నెలలోనే ఈ రోడ్డు వేయించామన్నారు. అలాగే మండలం మలయనూరులో రూ. ఐదు లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంటును వీరు ప్రారంభించారు.

Updated Date - Nov 29 , 2025 | 12:40 AM