రూ. 10 లక్షలతో రహదారులకు మరమ్మతులు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:03 AM
మండలంలోని ఆర్‌అండ్‌బీ రహదారులకు రూ. 10 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టారు.
కణేకల్లు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్‌అండ్‌బీ రహదారులకు రూ. 10 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టారు. రహదారుల గుంతలను పూడ్చడం, సైడ్‌బర్మ్‌కు మట్టివేయడం, నంబర్ రాళ్లను పాతడం తదితర పనులు చేపట్టినట్లు ఆ శాఖ డీఈ రవిశంకర్ తెలిపారు.