Share News

పరిశ్రమ వాహనాలతో రోడ్డు శిథిలం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:23 AM

మండల కేంద్రంలోని కళ్యాణదుర్గం, బళ్లారి రోడ్డు ప్రమాదానికి వేదికగా మారింది. బొమ్మనహాళ్‌ సమీపంలోని ఓ పరిశ్రమకు వెళ్లే భారీ వాహనాలు అధికంగా ఈ రోడ్డుపై వెళ్తుండటంతో .. అది పూర్తి శిథిలావస్థకు చేరుకుంది.

పరిశ్రమ వాహనాలతో రోడ్డు శిథిలం
గుంతల రోడ్డులో అదుపుతప్పి.. టిప్పర్‌ ఎదుట పడిపోయిన బైక్‌

బొమ్మనహాళ్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంలోని కళ్యాణదుర్గం, బళ్లారి రోడ్డు ప్రమాదానికి వేదికగా మారింది. బొమ్మనహాళ్‌ సమీపంలోని ఓ పరిశ్రమకు వెళ్లే భారీ వాహనాలు అధికంగా ఈ రోడ్డుపై వెళ్తుండటంతో .. అది పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. రోడ్డు మొత్తం గుంతలు మయంగా మారింది. ప్రాణాలను పణంగాపెట్టి గ్రామస్థులు ఈ రోడ్డుపై వెళ్తున్నారు. గురువారం ఉద్ధేహళ్‌ వాసి బాషా బైక్‌పై బళ్లారి నుంచి స్వగ్రామానికి వెళ్తూ.. బొమ్మనహాళ్‌ క్యాంప్‌లో గుంత వద్ద బైక్‌ అదుపు తప్పి కిందపడ్డాడు. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను డ్రైవర్‌ బ్రేక్‌ వేసి.. ఆపడంతో ప్రమాదం తప్పినట్లైంది. పరిశ్రమ వాహనాల వల్లే రోడ్డు నాశనమైందని, కానీ మరమ్మతులకు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డును వెంటనే బాగుచేయలని కోరుతున్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:23 AM