Rights: హక్కుల సాధనే ధ్యేయం
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:31 PM
‘ఏ ప్రభుత్వానికి మనం తొత్తులు కాదు. హక్కుల సాధనే ధ్యేయంగా ముందుగా సాగాలి’ అని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీఓ హోంలో సోమవారం ఏపీఎనజీజీఓ సంఘం సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీఎన్జీఓ నగర అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌బాబుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఏపీఎనజీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఏపీఎనజీఓ సభ్యత్వ నమోదులో ఉద్యోగ సంఘాల నేతలు
అనంతపురం ప్రెస్‌క్లబ్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘ఏ ప్రభుత్వానికి మనం తొత్తులు కాదు. హక్కుల సాధనే ధ్యేయంగా ముందుగా సాగాలి’ అని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీఓ హోంలో సోమవారం ఏపీఎనజీజీఓ సంఘం సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీఎన్జీఓ నగర అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌బాబుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఏపీఎనజీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హృదయరాజు మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఐక్యతగా సభ్యత్వం తీసుకోవడంతోనే ఏపీఎనజీజీఓ విస్తరణ అవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో హక్కుల సాధన కోసం లక్ష మంది ఉద్యోగులు ఉద్యమానికి శ్రీకారం చుడితే జగన పోలీసులతో అణచివేశాడన్నారు. అదే చంద్రబాబు అయితే ఉద్యోగులను చర్చలకు పిలుస్తాడన్నారు.
హక్కుల సాధన కోసం అక్టోబరులో నిర్వహించే ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.న్నారు. పెన్షనర్ల సంఘం జిల్లా అద్యక్షుడు పెద్దనగౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ఏవీ సాధించాలన్న ఏపీఎనజీఓ తోనే సాధ్యమన్నారు. ఏపీఎనజీజీఓ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సంఘంలో మెంబర్‌షిప్ తీసుకుని సంఘటితంగా పోరాటం చేయాలన్నారు. నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నగరశాఖ ఆధ్వర్యంలో భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు శ్రీకారం చుట్డడం శుభపరిణామమన్నారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి సభ్యత్వాలను తీసుకున్నారు. సమావేశంలో ఏపీఎనజీఓ జిల్లా కార్యదర్శి చంద్రమోహన, మహిళా విభాగం జిల్లా చైర్‌పర్సన జమీలా బేగం, కమర్షియల్ ట్యాక్య్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటే్‌షబాబు, అగ్రికల్చర్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఆర్టీసీ ఎంప్లాయీస్ చైర్మన సూరిబాబు, ఎస్టీయూ టీచర్స్ అసొసియేషన అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.