పోగొట్టుకున్న సొమ్ము అప్పగింత
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:08 AM
మండలంలోని గోపులాపురాని కి చెందిన గీతమ్మ ఈ నెల 17న కణేకల్లులో ఇతరుల దగ్గర రూ. 22 వేలు అప్పుగా తీసుకుంది. అదే రోజు సాయంత్రం నగదుతో ఆమె గోపులాపురానికి వెళుతుండగా కణేకల్లు క్రాస్ వద్ద నగదుతో పాటు ఏటీఎం కార్డు, బ్యాంక్ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు పోగొట్టుకుంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కణేకల్లు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోపులాపురాని కి చెందిన గీతమ్మ ఈ నెల 17న కణేకల్లులో ఇతరుల దగ్గర రూ. 22 వేలు అప్పుగా తీసుకుంది. అదే రోజు సాయంత్రం నగదుతో ఆమె గోపులాపురానికి వెళుతుండగా కణేకల్లు క్రాస్ వద్ద నగదుతో పాటు ఏటీఎం కార్డు, బ్యాంక్ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు పోగొట్టుకుంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆ నగ దు కణేకల్లుకు చెందిన ఓ మహిళకు దొరికినట్లు గుర్తించారు. ఆమె నుంచి ఆ డబ్బు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొని.. గీతమ్మను బుధవారం అందజేశారు. దీంతో గీతమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.