ఘనంగా అంకాలమ్మ దేవర
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:07 PM
పట్టణంలోని పాతగుంతకల్లులోని శ్రీ అంకాలమ్మ దేవరను బుధవారం ఘనంగా నిర్వహించారు.
గుంతకల్లు/టౌన, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాతగుంతకల్లులోని శ్రీ అంకాలమ్మ దేవరను బుధవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు తమ బంధువులను, సన్నిహితులను ఆహ్వానించడంతో పాతగుంతకల్లు జనసంద్రమైంది. టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణస్వామి, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన వెంకట శివుడు యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు.