Share News

భూ సమస్యలు పరిష్కరించండి : బీజేపీ

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:35 AM

మండలంలోని వివిధ గ్రా మాల్లో భూ సమస్యలతో రైతులు అనేక సంవత్సరాలుగా తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ పేర్కొన్నారు.

భూ సమస్యలు పరిష్కరించండి : బీజేపీ
తహసీల్దారుతో మాట్లాడుతున్న కొనకొండ్ల రాజేష్‌

కూడేరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివిధ గ్రా మాల్లో భూ సమస్యలతో రైతులు అనేక సంవత్సరాలుగా తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం తహసీల్దారు మహబూబ్‌బాషాను విజ్ఞప్తి చేశారు. ఏళ్లతరబడి రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారని, ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. త్వరిత గతిన ఆ సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దారు హామీ ఇచ్చారు.

Updated Date - Dec 18 , 2025 | 12:35 AM