Share News

అదనపు బస్సుల కోసం రాస్తారోకో

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:18 AM

ఉరవకొండ నుంచి చిన్నముష్ట్టూరు ఆదర్శ పాఠశాలకు ఒకే ఆర్టీసీ బస్సు ఉందని, అందులో 150 మంది వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని, మరో రెండు బస్సులను అదనంగా కేటాయించాలని ఆ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు

అదనపు బస్సుల కోసం రాస్తారోకో
రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

ఉరవకొండ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఉరవకొండ నుంచి చిన్నముష్ట్టూరు ఆదర్శ పాఠశాలకు ఒకే ఆర్టీసీ బస్సు ఉందని, అందులో 150 మంది వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని, మరో రెండు బస్సులను అదనంగా కేటాయించాలని ఆ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు బుధవారం అనంతపురం- గుంతకల్లు రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ విషయాన్ని డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. వీరి రాస్తారోకోతో ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు విద్యార్థులకు సర్ధిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Updated Date - Aug 07 , 2025 | 12:18 AM