కాజ్‌వేకు మరమ్మతులు
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:35 PM
వేదావతి హగరిపై వేపలపర్తి - రాయదుర్గం మధ్య ఉన్న కాజ్‌వేకు పలు గ్రామాల ప్రజలు శుక్రవారం మరమ్మతులు చేసి.. బాగు చేసుకున్నారు.
గుమ్మఘట్ట, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): వేదావతి హగరిపై వేపలపర్తి - రాయదుర్గం మధ్య ఉన్న కాజ్‌వేకు పలు గ్రామాల ప్రజలు శుక్రవారం మరమ్మతులు చేసి.. బాగు చేసుకున్నారు. ఇటీవల బీటీపీ గేట్లు ఎత్తడంతో వరదనీటి ప్రవాహానికి ఈ కాజ్‌వే పూర్తిగా కొట్టుకుపోయింది. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేవారు. వరద తగ్గడంతో కాజ్‌వేకు వేపలపర్తి, గోవిందయ్యదొడ్డి, గుండిగానిపల్లి తదితర గ్రామస్థులు చొరవ తీసుకొని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములు సహకారంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి ఆ దారిని బాగు చేసుకున్నారు.