Repairs తెగిన రహదారికి మరమ్మతులు
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:27 PM
మండల కేంద్రం నుంచి ఉరవకొండకు గతంలో హెచ్చెల్సీపై వెళ్లేవారు. అయితే ఆ కాలువ శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది క్రితం దానిపై వాహనరాకపోకలను అధికారులు నిలిపివేశారు.
కణేకల్లు, జూన 24(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి ఉరవకొండకు గతంలో హెచ్చెల్సీపై వెళ్లేవారు. అయితే ఆ కాలువ శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది క్రితం దానిపై వాహనరాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో అప్పటి నుంచి స్థానిక వేదావతి హగరిలో ఉన్న మట్టిరోడ్డు ద్వారా వాహనరాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ వర్షం వచ్చిన ప్రతిసారి ఈ రహదారి నీటితో కొట్టుకుపోయేది. ఇలా రహదారి తెగిన ప్రతిసారి స్థానిక టీడీపీ నాయకులు దానికి సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఇలా ఇప్పటికి తొమ్మిది సార్లు రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఇటీవల కురిసిన వర్షానికి మళ్లీ రోడ్డు కొట్టుకొని పోవడంతో.. పదోసారి కూ డా టీడీపీ నాయకులు మరమ్మతులు చేయించారు. స్థానిక టీడీపీ నాయకుడు ఆనంద్‌రాజ్ ఆధ్వర్యంలో నాయకులు లాలెప్ప, బీటీ రమేష్, చంద్రశేఖర్‌గుప్తా, కురుబ నాగరాజు, చాంద్‌బాషా, శరభనగౌడ్ ఈ పనులు చేపట్టారు.