Share News

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి : సీపీఐ

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:06 AM

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీ పీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసనలు, ధర్నాలు చేపట్టారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి : సీపీఐ
గుంతకల్లులో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీ పీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసనలు, ధర్నాలు చేపట్టారు. గుం తకల్లులో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోవిందు, యాడికిలో సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి జూటూరు రఫీ, కూడేరులో సిపిఐ, రైతు సంఘం మం డల కార్యదర్శి రమణ, గుత్తిలో ని యోజకవర్గ సహాయ కార్యదర్శి రమే ష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయా తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు.

Updated Date - Dec 16 , 2025 | 12:06 AM