గొర్రెల షెడ్లను తొలగించండి
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:44 PM
మండలంలోని కరకముక్కలలో ఇళ్ల మధ్యలో రెండు గొర్రెల షెడ్లను ఏర్పాటు చేశారని, వాటి నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్థులు కే గాదిలింగ, కాశీ, నాగరాజు తదితరులు గురువారం వాపోయారు.
విడపనకల్లు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని కరకముక్కలలో ఇళ్ల మధ్యలో రెండు గొర్రెల షెడ్లను ఏర్పాటు చేశారని, వాటి నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్థులు కే గాదిలింగ, కాశీ, నాగరాజు తదితరులు గురువారం వాపోయారు. ఆ షెడ్లల్లో దాదాపు 1000 గొర్రెలు ఉన్నాయని, వాటి పెంటను కూడా అక్కడే దిబ్బలా వేశారని, వాటి నుంచి వచ్చే దర్వాసనను భరించలేక పోతున్నామని అన్నారు. ఇటీవల వర్షాలు అధికంగా వస్తుండటంతో దుర్వాసన మరింత అధికమైందన్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు రోగాల బారిన పడుతున్నారన్నారు. దీనిపై సోమవారం స్థానిక సచివాలయంలో సోమవారం ఫిర్యాదు చేశామని, స్పందించిన గ్రామ కార్యదర్శి లోకేష్ గొర్రెల షెడ్లను పరిశీలించారని, ఉన్నతాధికారులతో చర్చించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. అధికారులు స్పందించి.. ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన గొర్రెల షెడ్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.