వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు బంద్
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:08 AM
యాడికి సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయంలో వారంరోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు.
యాడికి, సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): యాడికి సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయంలో వారంరోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు కిటకిటలాడే యాడికి సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయం.. వారం రోజులుగా బోసిపోయింది. వారం క్రితం వర్షం పడిన సమయంలో విద్యుత ఓల్టేజీ హెచ్చుతగ్గులతో బ్యాటరీలు, యూపీఎ్‌సలు చెడిపోయాయి. రిజిస్ట్రేషన ప్రక్రియలో విద్యుత నిరంతర సరఫరా అవసరం. అయితే విద్యుత సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు .. యూపీఎ్‌సలు పని చేయకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. రెండు రోజులుగా యూపీఎస్ మరమ్మతులు చేపడుతున్నారు. దీనిపై యాడికి సబ్‌రిజిసా్ట్రర్ జాఫర్ సాధిక్‌ను వివరణ కోరగా... ‘ విద్యుత హెచ్చుతగ్గులతో యూపీఎస్ పనిచేయడం లేదు. మరమ్మతులు చేయడానికి టెక్నీషియనను పిలిపించాం. ఎందుకు ఇలా జరిగిందో సమస్యను ఇంకా గుర్తించలేదు. వీలైనంత వేగంగా మరమ్మతులు చేపట్టి రిజిస్ట్రేషనలను కొనసాగిస్తాం’ అని తెలిపారు.