ఈ క్రాప్ నమోదు తప్పనిసరి : జేడీఏ
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:48 PM
ప్రతి రైతు సాగు చేసిన పంటలను ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని జేడీఏ ఉమామహేశ్వరీ సూచించారు.
గుత్తిరూరల్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రతి రైతు సాగు చేసిన పంటలను ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని జేడీఏ ఉమామహేశ్వరీ సూచించారు. మండలంలోని జక్కలచెరువులో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. పత్తి పంటను పరిశీలించారు. మండలానికి 30 టన్నులు జిప్సం వచ్చిందన్నారు. ఆమె వెంట ఏడీఏ వెంకటరాముడు, ఏఓ ముస్తాక్ అహామ్మద్ ఏంపీఓలు ఉన్నారు.