Share News

ఎల్‌ఆర్‌ఎ్‌సకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:31 PM

అనధికార లే-ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రా ష్ట్ర ప్రభుత్వం తెచ్చిన లే-ఔట్‌ రెగ్యులరైజేషన పథకానికి (ఎల్‌ఆర్‌ఎస్‌) గుంతకల్లు మున్సిపాల్టీలో రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి.

ఎల్‌ఆర్‌ఎ్‌సకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు
గుంతకల్లు మున్సిపాల్టీ కార్యాలయం

గుంతకల్లు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అనధికార లే-ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రా ష్ట్ర ప్రభుత్వం తెచ్చిన లే-ఔట్‌ రెగ్యులరైజేషన పథకానికి (ఎల్‌ఆర్‌ఎస్‌) గుంతకల్లు మున్సిపాల్టీలో రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో, రాయలసీమలో టాప్‌-5లో నిలిచింది.

అత్యధిక దరఖాస్తులు: ఈ పథకం కింద గుంతకల్లు మున్సిపాల్టీ 463 దరఖాస్తులతో మొదట స్థానంలో, అనంతపురం నగర పాలక సంస్థ 354 దరఖాస్తులతో రెండో స్థానంలో, ధర్మవరం పురపాలక సంఘం 287 దరఖాస్తులతో మూడో స్థానంలో ఉన్నాయి.

73 తిరస్కరణ : గుంతకల్లులో వచ్చిన 463 దరఖాస్తుల్లో 258 దరఖాస్తులకు ఆమోదం లభించగా, 73 దరఖాస్తులను తిరస్కరించామని, మరో 132 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని అధికారులు వివరించారు.

వినియోగించుకోండి: ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం జనవరి 23తో ముగుస్తుందని మున్సిపల్‌ సిటీ ప్లానింగ్‌ ఆఫీసరు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలో 87 అనధికారిక లే-ఔట్లను గుర్తించామని, ఆ లోపు ఆ స్థలాలు, లే-ఔట్ల రెగ్యులరైజేషనకు అప్లై చేసుకోవాలని అన్నారు. తర్వాత కొన్ని రోజులు అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:31 PM