పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:44 AM
పార్టీ అభివృద్ధికి పనిచేసిన కార్యకర్తలను టీడీపీ అధిష్టానం గుర్తించి.. తప్పకుండా పదవులు ఇస్తుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు.
గుంతకల్లు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పార్టీ అభివృద్ధికి పనిచేసిన కార్యకర్తలను టీడీపీ అధిష్టానం గుర్తించి.. తప్పకుండా పదవులు ఇస్తుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక రాయల్ ఫంక్షన హాల్‌లో నియోజకవర్గంలోని మూడు మండలాలు, పట్టణాల పార్టీ కమిటీలు, క్లస్టర్, యూనిట్, బూత కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ కమిటీలలో నియమితులైనవారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణస్వామి, కేసీ హరి, బీఎస్ కృష్ణారెడ్డి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, తలారి మస్తానప్ప, పత్తి హిమబిందు పాల్గొన్నారు.