Share News

కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:28 AM

పార్టీ అభివృద్ధి కోసం కష్ట పడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూర్‌ జయరాం పేర్కొన్నారు.

కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు
మార్కెట్‌ యార్డు చైర్మనగా ప్రమాణస్వీకారం చేస్తున్న సూర్య ప్రతాప్‌

గుత్తి ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): పార్టీ అభివృద్ధి కోసం కష్ట పడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూర్‌ జయరాం పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నూతన పాలక వర్గ ప్రమాణస్వీకారాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక గాంధీ సర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా మార్కెట్‌ యార్డు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సభలో మార్కెట్‌ యార్డు చైర్మనగా జక్కలచెరువుకు చెందిన గుర్రాల సూర్య ప్రతాఫ్‌ నాయుడు, వైస్‌ చైర్మనగా మాలిక్‌ బాషాతో మార్కెట్‌ యార్డు కార్యదర్శి బాలాజీ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. కమిటీ డైరెక్టర్లుగా బావిగడ్డ ఓబుళయ్య, భారతీ, సుబ్బలక్ష్మి, హరిక్రిష్ణ, నాగ వీరమ్మ, నాగేశ్వర్‌రావు, వెంకటేశ, క్రిష్ణాబాయి, లక్ష్మి, సరస్వతి, రంగారెడ్డి, మిద్దె ఓబుళేసు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, అందులో భాగంగా మార్కెట్‌ యార్డు కమిటీలకు పూర్వవైభవం తెస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, జన సేన నియోజకవర్గం కన్వీనర్‌ వాసుగిరి మణికంఠ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌, రాష్ట్ర నాయకులు అంకాల రెడ్డి, పట్టణ మండల టీడీపీ అధ్యక్షుడు ఎంకే చౌదరి, భద్రి వలి, గుత్తి గుంతకల్లు సింగిల్‌ విండో అధ్యక్షులు శివశంకర్‌, మస్తానప్ప, పాటిల్‌ సురేష్‌, న్యాయవాది సోముశేఖర్‌, నాయకులు చికెన శ్రీనివాసులు, రమేష్‌, రాజా, ప్రసాద్‌, శ్రీదేవి, సునితా, సర్పంచలు భరతకుమార్‌, లింగమయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:28 AM