Share News

RDT ఆర్డీటీ సేవలు అమూల్యం :ఎమ్మెల్యే పరిటాల

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:35 PM

ఆర్డీటీ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కొనియాడారు.

RDT  ఆర్డీటీ సేవలు అమూల్యం :ఎమ్మెల్యే పరిటాల
బుద్ధిమాంద్యం పిల్లలతో ఎమ్మెల్యే పరిటాల సునీత

కదిరి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కొనియాడారు. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో బుధవారం కదిరి పట్టణానికి సమీపంలోని ఆర్డీటీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అక్కడున్న బుద్ధిమాంద్యం, మెదడు పక్షపాతానికి గురైన పిల్లల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఇంతమంది పిల్లలను ఆర్డీటీ చేరదీయడం చాలా గొప్పవిషయమన్నారు. అక్కడి సిబ్బంది శ్రద్ధ, ఓపికను ఆమె అభినందించారు.

Updated Date - Apr 16 , 2025 | 11:35 PM