Share News

RDT ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేయాలి

ABN , Publish Date - May 16 , 2025 | 12:07 AM

ఆర్డీటీకి విదేశీ నిధులు అందేలా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేయాలని మామిళ్లకుంట్లపల్లి గ్రామస్థులు విజప్తి చేశారు.

RDT ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేయాలి
డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న గ్రామస్థులు

ఓబుళదేవరచెరువు, మే 15(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి విదేశీ నిధులు అందేలా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేయాలని మామిళ్లకుంట్లపల్లి గ్రామస్థులు విజప్తి చేశారు. గురువారం ఈ మేరకు వారు స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. పేదలకు అండగా ఉంటున్న ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధులు రాకుండా అడ్డుకోవడం బాధాకరమన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆ గ్రామస్థులు నాగేళ్ల బావన్న, ఆంజనప్ప, లక్ష్మీనరమ్మ, చంద్రకళ, సాలెమ్మ, లక్ష్మమ్మ, కాంతమ్మ ఉన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:07 AM