రంగయ్యా... ప్రమాణానికి సిద్ధమా..?
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:16 AM
ఇసుక, మట్టి అమ్ము కొంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఇసుక, మట్టి అమ్ముకున్నారో.. వేపులపర్తి రంగనాథస్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా..? ’ అని టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు బహిరంగ సవాల్ విసిరారు.
బ్రహ్మసముద్రం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘మాజీ ఎంపీ రంగయ్య .. మీ హయాంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అందుకోసం తన సొంత డబ్బులను కూడా విరివిగా ఖర్చు చేస్తున్నారు. ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక.. గ్రూపు-1 అధికారిగా పనిచేసిన నీవు .. హుందాతనాన్ని వీడి.. లేనిపోని వివర్శలు చేస్తున్నారు. ఇసుక, మట్టి అమ్ము కొంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఇసుక, మట్టి అమ్ముకున్నారో.. వేపులపర్తి రంగనాథస్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా..? ’ అని టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు బహిరంగ సవాల్ విసిరారు. మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉషశ్రీచరణ్, ఎంపీగా రంగయ్య ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత లేక నియోజకవర్గం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. భైరవానతిప్ప ప్రాజెక్టుకు నీళ్లు రావని రంగయ్య వ్యంగ్యంగా మాట్లాడారని, కానీ ఎమ్మెల్యే అమిలినేని ప్రత్యేక చొరవతో కాలువ పనులు చేయించారని, మరో నాలుగు రోజుల్లో చెరువు నిండి మరువ పారనుందని తెలిపారు. ఇప్పటికైనా రంగయ్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇందులో బీఎ్‌సఎనఎల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ అమరా రామ్మోహన చౌదరి, జెడ్పీటీసీ పద్మావతి, మాజీ జెడ్పీటీసీ వెంకటేశులు, రాష్ట్ర తెలుగు రైతు సంఘం కార్యదర్శి కురుగౌడ, సింగిల్ విండో ప్రెసిడెంట్ అంకె ఓబుళేసు, ప్రధాన కార్యదర్శి తలారి భీమప్ప, మాజీ వైస్ ఎంపీపీ చిత్తప్ప, క్లస్టర్-2 ఇనఛార్జ్ నాగరాజు, భైరవానితిప్ప మాజీ సర్పంచ రామచంద్రప్ప పాల్గొన్నారు.