Share News

tdp నాడు పారిపోయి .. నేడు పాదయాత్రా..!

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:00 AM

వైసీపీ పాలనలో నాటి మంత్రి ఉషశ్రీచరణ్‌కు భయపడి పారిపోయిన మాజీ ఎంపీ తలారి రంగయ్య.. నేడు ఆర్డీటీని అడ్డు పెట్టుకొని పాదయాత్ర పేరుతో రాజకీయాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు.

tdp నాడు పారిపోయి .. నేడు పాదయాత్రా..!
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, జూన 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో నాటి మంత్రి ఉషశ్రీచరణ్‌కు భయపడి పారిపోయిన మాజీ ఎంపీ తలారి రంగయ్య.. నేడు ఆర్డీటీని అడ్డు పెట్టుకొని పాదయాత్ర పేరుతో రాజకీయాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం కంబదూరు ప్రభుత్వాస్పత్రిలో నూతన భవనాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాలంటే ఢిల్లీ వెళ్లి ధర్నానో.. పాదయాత్రో చేపట్టాలే గాని.. ఇక్కడ పాదయాత్ర చేయడం వృథా అని హితవుపలికారు. ఆర్డీటీని తలారి రంగయ్య, వైసీపీ నాయకులు రాజకీయస్వార్థం కోసం వాడుకొంటున్నారని, దీన్ని ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. అనంతరం కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డులో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కళ్యాణదుర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:00 AM