Share News

పంటలకు వర్షం దెబ్బ

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:56 PM

మండలంలో గురువారం కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పంటలకు వర్షం దెబ్బ
నీట మునిగిన ఆముదం పంట

బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి) మండలంలో గురువారం కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన రైతు రామంజనేయులుకు చెందిన నాలుగు ఎకరాల్లో ఆముదం, నాలుగు ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నీరు ఎక్కువగా ఆముదం పంటలో నిలువ ఉండడం వల్ల చెట్లు కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆముదం కరువును తట్టుకునే పంట అని సాగు చేస్తే ఒక వర్షం వల్ల దెబ్బతిందని వాపోయాడు. పంట నష్టం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. దీనిపై ఏఓ సాయికుమార్‌ను వివరణ కోరగా.. పస్తుతం వరిలో నీరు నిలువ ఉన్న పెద్దగా ప్రమాదం ఉండబోదని, కాని ఆముదం, పత్తి, మొక్కజొన్న పంటలో నీరు నిల్వ ఉండకుండా బయటకు మళ్లించాలని సూచించారు.

Updated Date - Sep 12 , 2025 | 11:56 PM