Share News

Raghavendra Swamy నేటి నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:09 PM

పట్టణంలో వెలసిన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో స్వామివారి 354వ ఆరాధనోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతాయని అర్చకులు వాదిరాజులు తెలిపారు.

Raghavendra Swamy నేటి నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
రాఘవేంద్రస్వామి బృందావనం

పెనుకొండ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలో వెలసిన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో స్వామివారి 354వ ఆరాధనోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతాయని అర్చకులు వాదిరాజులు తెలిపారు. ఆదివారం పూర్వారాధన సందర్భంగా ఉదయం నిమ్మలసేవ, నిర్మాల విసర్జన, పంచామృతాభిషేకాలు, అష్టోత్తర పారాయణాలు, పాదపూజ, కనకమహాపూజ, అష్టోదశకం మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. అనంతరం పల్లకీసేవ, స్వస్తవాచనం జరుగుతుందన్నారు. సోమవార మద్యారాధన, మంగళవారం ఉత్తరారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొని స్వామికృపకు పాత్రులు కావాలన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 11:09 PM