Share News

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:33 AM

మొక్కజొన్న, వరి, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరతో పం టలను కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు డి మాండ్‌ చేశారు

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
డీటీకి వినతి పత్రం ఇస్తున్న రైతులు, నాయకులు

ఉరవకొండ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న, వరి, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరతో పం టలను కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు డి మాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద మం గళవారం ఆందోళన నిర్వహించిన వారు మాట్లాడారు. ఖరీ్‌ఫలో సాగు చేసిన పంటలకు ప్రైవేట్‌ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారన్నారు. దీంతో పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులు పంటను ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకున్న తర్వాత కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అనంతరం డీటీ భోగన్న గౌడ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతు సంఘం నాయకులు మధుసూధన, జ్ఞానమూర్తి, శీనప్ప, సూర్యనారాయణ, కౌలు రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, వెంకటేష్‌, సుంకన్న పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:33 AM