పప్పుశనగ పంపిణీ చేయాలి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:36 AM
పప్పుశనగ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని వైసీపీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు.
పుట్లూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పప్పుశనగ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని వైసీపీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు. ఆ పార్టీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో సబ్సిడీ పప్పుశనగ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అదును దాటాక ఇచ్చినా ఫలితం ఉండదన్నారు. యూరియా, పంటలకు మద్ధతుధర ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం వినతిపత్రాన్ని డిప్యూటి తహసీల్దార్ మహబూబ్‌బాషాకు అందించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, కన్వీనర్ మహేశ్వర్‌రెడ్డి, నాగేశ్వరరావు, రమణయాదవ్, సర్పంచు మహేశ్వర్‌రెడ్డి, రాంమోహన పాల్గొన్నారు.