ప్రజాసమస్యలను పరిష్కరించాలి: విప్
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:11 AM
ప్రజలు, రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని విప్ కాలవ శ్రీనివాసులు ఆదేశించారు
డీ.హీరేహాళ్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రజలు, రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని విప్ కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక మండల ప్రజాపరిషత కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించి.. ప్రజల నుంచి 109 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దాసనాయక్, మార్కెట్‌యార్డ్ ఛైర్మన హనుమంతరెడ్డి, ఆర్యవైశ్య కార్పోరేషన డైరెక్టర్ నాగళ్లి రాజు, మండల కన్వీనర్ మోహనరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.