Share News

వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి కల్పించండి

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:19 AM

వీఆర్‌ఏలకు వీఆర్వోలు గా ఉద్యోగోన్నతి కల్పించాలని, అర్హత ఉన్న వీఆర్‌ఏలను నైట్‌వాచమెన , అటెండర్‌ పోస్టుల్లో నియమించాలని జిల్లా వీఆర్‌ఏ అధ్యక్షుడు పరమేశ్వరప్ప డిమాండ్‌ చేశారు.

వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి కల్పించండి
కణేకల్లులో సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలు

కణేకల్లు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వీఆర్‌ఏలకు వీఆర్వోలు గా ఉద్యోగోన్నతి కల్పించాలని, అర్హత ఉన్న వీఆర్‌ఏలను నైట్‌వాచమెన , అటెండర్‌ పోస్టుల్లో నియమించాలని జిల్లా వీఆర్‌ఏ అధ్యక్షుడు పరమేశ్వరప్ప డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు రెండురోజుల సమ్మెలో భాగంగా ఆందోళన చేపట్టారు. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ నమోదు చేయడంతో పాటు నామినిగా పనిచేసేవారిని వీఆర్‌ఏలుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటేశులు, లింగప్ప, వన్నూరుస్వామి, శంకర్‌, లోకేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:19 AM