రోజూ తాగునీరు సరఫరా చేయండి
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:11 AM
ఉరవకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్య్లూఎస్ అధికారులకు ఆర్థిక శా ఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు.
ఉరవకొండ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఉరవకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్య్లూఎస్ అధికారులకు ఆర్థిక శా ఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. అనంతపురంలోని రాంనగర్‌లో గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్‌డబ్య్లూఎస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలన్నారు. అవసరమైన పైప్‌లైన, ఓహెచఎ్‌సఆర్ ట్యాంకులు, కుళాయిలు తదితర అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నింబగల్లు ఎస్‌ఎ్‌సట్యాంకును పూర్తిగా నింపడానికి అవసరమైన ట్రాన్సఫార్మర్ ఏర్పాటుతోపాటు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసులు, డీఈ సఫ్రీన పాల్గొన్నారు.