Share News

water తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:20 AM

తమ ప్రాంతంలో నెలకున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని మదీనమసీదు వెనుక వీధి, బీఎ్‌సఎనఎల్‌ కాలనీవాసులు బుధవారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.

 water తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
రాస్తారోకో చేస్తున్న నాయకులు, మహిళలు

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): తమ ప్రాంతంలో నెలకున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని మదీనమసీదు వెనుక వీధి, బీఎ్‌సఎనఎల్‌ కాలనీవాసులు బుధవారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. వీరికి ఆర్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. మహిళలు మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వీటికి తోడు అరకొరగా వస్తున్న నీరు బుదరగా ఉంటోందని వాపోయారు. ఈ రాస్తారోకోతో కదిరి, హిందూపురం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కార్యదర్శి శ్రీకాంత ఆందోళనకారులతో మాట్లాడారు. బురదనీరు నివారించేంత వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు ట్యాంకర్‌ను తెప్పించడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఆర్సీపీ డివిజన కార్యదర్శి మున్నా, రైతు సంఘం రామచంద్ర, కాలనీవాసులు లడ్డుబాబ్‌జాన, చాంద్‌బాషా, వెంకటేష్‌, ఫాతిమా, మైమూన, బాబా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:21 AM