Share News

మురుగుకాలువలు నిర్మించాలని ధర్నా

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:18 AM

మున్సిపల్‌ పరిధిలోని 11వ వార్డులో మురుగు కాలువ నిర్మించాలని ఆ కాలనీ వాసులు సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశా రు.

మురుగుకాలువలు నిర్మించాలని ధర్నా
అధికారులతో కాలనీవాసుల వాగ్వాదం

గుంతకల్లుటౌన, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ పరిధిలోని 11వ వార్డులో మురుగు కాలువ నిర్మించాలని ఆ కాలనీ వాసులు సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశా రు. నాలుగు నెలల క్రితం మురుగు కాలువల నిర్మాణం కోసం గుం తలు తవ్వి వదిలేశారని, ఆ కాలువల్లో పూడిక పేరుకుపోయి మురుగు ఇళ్ల ముందర నిల్వ ఉంటోందని వాపోయారు. ఆ గుంత ల్లో పడి చిన్నారులు గాయపడుతున్నారని, దీనిపై పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ నయీమ్‌ఆహ్మద్‌తో ఆ కాలనీవాసులు వాగ్వివాదానికి దిగారు. ఎంఈ ఇంతియాజ్‌, డీఈ షబానా మాట్లాడుతూ మంగళవారం నుంచి కాలువ నిర్మాణ పనులు మొదలుపెడతామని చెప్పడంతో ఆ కాలనీ వాసులు శాంతించారు.

Updated Date - Oct 14 , 2025 | 01:18 AM