విద్యుత బిల్లుపై నిరసన
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:57 PM
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత సవరణల బిల్లు కార్పొరేట్ సంస్థల లబ్ధి చేకూర్చేలా ఉందని రైతు సంఘం నాయకులు మండిపడ్డారు.
పెద్దవడుగూరు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత సవరణల బిల్లు కార్పొరేట్ సంస్థల లబ్ధి చేకూర్చేలా ఉందని రైతు సంఘం నాయకులు మండిపడ్డారు.ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా సహాయ కార్యదర్శి దస్తగిరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యుత బిల్లు 2025 ప్రకారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యుత పంపిణీ సంస్థలు ప్రైవేట్ పరం అవుతున్నాయన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత ఉండదన్నారు. దీంతోపాటు గృహ విద్యుత వినియోగదారులకు ఇప్పటికి ఉన్న విద్యుత ఛార్జీలకు అదనంగా మరింత భారం పడుతుందని తెలిపారు. విద్యుత అంశం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, అయినా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించడం రాష్ర్టాల హక్కులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఈశ్వర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, ఓబులేసు, హనుమంతురెడ్డి, సూర్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.