యూరియా కోసం నిలదీత
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:46 PM
యూరియా కోసం కణేకల్లు క్రాసింగ్‌లో రైతులు అధికారులతో మంగళవారం వాగ్వాదానికి ది గారు. క్రాసింగ్‌లోని కోరమండల్ దుకాణానికి 150 బస్తాల యూ రియా సరఫరా కాగా వాటిని తీసుకునేందుకు దాదాపు 200 మంది రైతులు వచ్చారు.
కణేకల్లు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): యూరియా కోసం కణేకల్లు క్రాసింగ్‌లో రైతులు అధికారులతో మంగళవారం వాగ్వాదానికి ది గారు. క్రాసింగ్‌లోని కోరమండల్ దుకాణానికి 150 బస్తాల యూ రియా సరఫరా కాగా వాటిని తీసుకునేందుకు దాదాపు 200 మంది రైతులు వచ్చారు. దీంతో వాటిని ఎలా అందించాలో తెలియక కోరమండల్ దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలోనే యూరియా పంపిణీని పరిశీలించేందుకు తహసీల్దార్ బ్రహ్మయ్య, ఏఓ జగదీష్ అక్కడికి చేరుకోగా రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరికీ యూరియా సరఫరా చేస్తామని, ఆందోళన చెందవద్దని కోరారు.